- Advertisement -
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామాకు సిద్ధం అయ్యారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో జస్టిన్ ట్రూడో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 48 గంటల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2013లో ప్రధాని పదవిని చేపట్టారు ట్రూడో. గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడోపై ఇటీవలి కాలంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది. 2025 అక్టోబర్లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Also Read:భారత్లో తొలి HMPV కేసు..
- Advertisement -