కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

38
- Advertisement -

మన శరీరానికి అవసరమైన మూలకాలలో కాల్షియం ముఖ్యమైనది. ఇది ప్రధానంగా ఎముకలను దృఢంగా చేయడంలో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం పడుతుంది. మిగిలిన ఐదు శాతం కండర నిర్మాణంలో సహాయ పడుతుంది. మరి ఇలాంటి కాల్షియం తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా పెద్దలకు ప్రతిరోజూ 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది. అంతకు ఏ మాత్రం తగ్గిన కాల్షియం లోపం సంభవించే అవకాశం ఉంది. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, నిస్సత్తువ, మైకం, ఒళ్ళు నొప్పులు, ఇలా చాలానే సమస్యలు ఏర్పడతాయి. ఇంకా కాల్షియం లోపించిన వారిలో విరిగిన ఎముకలు అతుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా ఆడవారిలో కాల్షియం లోపిస్తే పీరియడ్స్ టైమ్ లో తీవ్రమైన నొప్పి కూడా ఎక్కువౌతుంది. .

కాబట్టి ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో కాల్షియం ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, పెరుగు, బచ్చలి కూర, బ్రోకలి, ఇతరత్రా ఆకు కూరాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా గసగసాలు, నువ్వులు, రాగులు, చియా విత్తనాలు వంటి వాటిలో కూడా కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి వీటిని కూడా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తీసుకుంటే కాల్షియం శరీరానికి త్వరగా అందుతుంది. అలాగే ఉదయాన్నే రాగిజావా తాగడం కూడా కాల్షియం పెరుగుదలకు దోహద పడుతుంది. కాబట్టి కాల్షియం లోపించినవారు.. మెడిసన్ ద్వారా లోపాన్ని భర్తీ చేసుకోవడం కంటే.. సహజ సిద్దంగా పైన సూచించిన ఆహార పదార్థాల ద్వారా పొందడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ …సెకండ్ లుక్

- Advertisement -