సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్‌ కమిటీ!

1
- Advertisement -

సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో మాట్లాడిన సీఎం…పరిశ్రమ కూడా కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ లో ఎక్కడైనా ఘాటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు…తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండన్నారు.

ముంబైలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది…కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమల ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అని…పరిశ్రమ ను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం అన్నారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం అని చెప్పిన సీఎం…అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అన్నారు.140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్ లో పతకాలు తెచ్చుకోలేకపోతుంది…స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.

గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని…సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి అన్నారు.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం..సినిమా పరిశ్రమ ను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం అన్నారు. మా ప్రభుత్వం పరిశ్రమ కు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.

Also Read:శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్

- Advertisement -