- Advertisement -
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులుగా రేపు ఎవరెవరితో ప్రమాణ స్వీకారం చేయించాలన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా..ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం లోక్‌సభ ఎంపీ కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించింది.
వెంటనే ఢిల్లీ రమ్మనడంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే హస్తినకు బయలుదేరారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరిబాబు వైఎస్ విజయమ్మపై విజయం సాధించారు. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రానికి చెందిన హరిబాబు ఆంధ్రాయూనివర్సిటీలో బి.టెక్ చదివారు. ఆంధ్రా యూనియవర్సిటీ నుంచి ఆయన పిహెచ్‌డి చేశారు.
- Advertisement -