అందరి దృష్టి కేంద్ర కేబినెట్ విస్తరణపైనే..!

37
modi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుండగా 2024 ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్‌,బీహార్, మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించనుందని సమాచారం. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ కూర్పు చేశారు మోడీ.

మధ్యప్రదేశ్‌ నుంచి జోతిరాధిత్య సింధియా, రాకేశ్‌ సింగ్‌ ,బీహార్‌ నుంచి ఎల్జేపీ నేత పశుపతి కుమార్‌ పరాస్‌, యూపీ నుంచి అప్నాదళ్‌ నాయకురాలు అనుప్రియ పటేల్‌, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ, మహారాష్ట్ర నుంచి పూనం మహాజన్‌, ప్రీతం ముండే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆరుగురికి కేబినెట్‌ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.