ప్రతిరోజూ మనం తినే కూరగాయలలో క్యాబేజీ ఒక్కటి. దీనితో రుచికరమైన కర్రిస్, వేపుడు, పచ్చడి వంటివి చేసుకుంటూ ఉంటారు. ఇంకా వివిధ రకాల చిరుతిండిలలో కూడా క్యాబేజీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే క్యాబేజీ కి ఉండే వాసన కారణంగా క్యాబేజీతో చేసిన వంటకాలను తినడానికి ఆసక్తి చూపించారు చాలమంది. అయితే క్యాబేజీ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు. క్యాబేజీలో మన శరీరానికి కావల్సిన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
విటమిన్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. అలాగే క్యాబేజీలో సల్ఫరఫెన్, కయోంప్ ఫెరల్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే యాంటీ ఇన్ ఫ్లామెంటరీ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని కీళ్ల నొప్పులు, వాపులు వంటి వాటిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా విటమిన్ సి.. సిట్రిక్ ఆమ్లం కలిగిన వాటిలో అనగా నిమ్మ, బెర్రి, కివీ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. అయితే క్యాబేజీలో మాత్రం సిట్రిక్ ఆమ్లం తక్కువగా ఉన్నప్పటికి విటమిన్ సి శాతం అధికంగా ఉంటుందని పలు పరిశోదనలు చెబుతున్నాయి.
కాబట్టి క్యాబేజీలో ఉండే విటమిన్ సి వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయట. ఇక క్యాబేజీలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మలబద్దకం సమస్య దూరమై జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. ఇక గుండె జబ్బులను దూరం చేయడంలో కూడా క్యాబేజీలో ఉండే పోషకాలు ఎంతో ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాబేజీలో ఉండే పొటాషియం హైబీపీని నియమ్తృంచడంలో సహాయపడుతుందట. ఇంకా క్యాబేజీలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనలు ఉన్న క్యాబేజీని తప్పని సరిగా ప్రతిఒక్కరూ తినాలనేది నిపుణులు చెబుతున్నా మాట.
Also Read:TTD:శ్రీవారి భక్తులకు విస్తృత ఏర్పాట్లు