తెలుగు ఫిల్మ్ ట్రేడ్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఎట్టకేలకు పూర్తయింది. ఈసారి అధ్యక్ష పదవి కోసం సి.కల్యాణ్, దిల్ రాజు ల మధ్య వార్ నడిచింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ కీలక ఎన్నికల్లో మొత్తం 1,567 మంది సభ్యుల ఓట్లలో దిల్ రాజుకు 563, సి. కల్యాణ్ కు 497 వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన పోటీలో దిల్ రాజు గెలుపొందారు. ప్రొడ్యూసర్ సెక్టార్ లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది. అయితే, ఈ గెలుపు కోసం దిల్ రాజు డబ్బులు పంచాడు అని సి కళ్యాణ్ ఫ్యానల్ ఆరోపణలు చేస్తోంది.
మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే.. గెలుపు వ్యూహాలు ఎవరికి వారు గట్టిగానే చేశారు. సి కళ్యాణ్ ప్యానెల్ వాళ్ళు కూడా సభ్యులను పరామర్శించి మరీ ఓట్లు అడిగారు. దిల్ రాజు మరో అడుగు ముందుకు వేసి.. ప్రత్యేక పార్టీలు ఇచ్చి మరీ సభ్యులను ఆకట్టుకున్నాడు. సాధారణ రాజకీయ ఎన్నికలు లాగే ఈ ఎన్నికలు జరిగాయి. సరే మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. మరి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేయబోతున్నారు?, గెలిచిన దిల్ రాజు ప్యానల్ అని వార్తలు రాయించుకోవడం కాదు.
Also Read:రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!
గెలిచిన తర్వాత ఫలానా పనులు చేయబోతున్నాం అని కరపత్రాలు పంచాలి. ఆ పనులను పూర్తి చేశాక కూడా పార్టీలు ఇవ్వాలి. ఓట్లు కోసం కరపత్రాలు పంచి, గెలుపు కోసం పార్టీలు ఇవ్వటం గొప్ప కాదు. గెలిపించినందుకు న్యాయం చేయడం గొప్ప. అయినా, సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురి చేతుల్లో నలిగపోతుంది అంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఆ ప్రచారంలోని వ్యక్తులే ఇప్పుడు గెలిచారు. మరి ఇప్పుడైనా అలాంటి ప్రచారాలు వచ్చే అవకాశం లేకుండా పనులు చేస్తే అందరికీ మంచిది.
Also Read:నితిశ్ మళ్ళీ ఎన్డీయే లోకి?