ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసిక వైద్యులు బి.వి.పట్టాభిరామ్ ఇకలేరు. గుండెపోటుతో ఆయన మరణించారు.ఆయన వయస్సు (75) .ఇంద్రజాలికుడిగా, మానసికవైద్యుడిగా, ప్రముఖ హిప్నాటిస్ట్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఇంద్రజాలకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పట్టాభిరామ్. ప్రముఖ హిప్నాటిస్ట్‌గా విస్తృత ఖ్యాతిని సంపాదించారు. కాలక్రమేణా ఆయన ఒక ప్రముఖ మానసిక వైద్యుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. ఇదే క్రమంలో అనేక పుస్తకాలను రచించారు.
Also Read:శ్రీ విష్ణు ..”లోపలికి రా చెప్తా”
ఆయన ప్రసంగాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయి. అంతేగాదు మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు దోహదపడ్డాయి. జూలై 2వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. అనంతరం జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

