పాపం నితిన్ బతుకు బస్టాండ్ అయిపోయింది..!

217
Hero Nithiin
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడకన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 26న ఈ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మధ్యే విడుదలైన రంగ్ దే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు రెండో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. బస్టాండే బస్టాండే అంటూ సాగే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పాడాడు. ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఈ పాటను శ్రీమణి రాసాడు. నితిన్, కీర్తి సురేష్‌పై వచ్చే ఈ టీజింగ్ సాంగ్ అదిరిపోయే కొరియోగ్రఫీ చేసాడు శేఖర్. ఇందులో నితిన్ డాన్సులతో పాటు ఇల్లు తుడవడం.. అంట్లు తోమడం లాంటివి కూడా చేసి నవ్వించాడు.

https://youtu.be/6yZPbSneXBM
- Advertisement -