ఆర్టీసీ …లక్షలాది మంది ప్రయాణీకులకు గమ్యస్ధానం చేర్చే ప్రజా రవాణా వ్యవస్ధ. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రయాణీకులకు చేరువవుతున్న ఆర్టీసీ…కొన్ని రాష్ట్రాల్లో కార్గో సర్వీసులను కూడా అందిస్తోంది.
ఇక చేయి ఎత్తిన చోట ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం లేదా వారి గమ్యాస్ధానాలకు చేర్చడం ఆర్టీసీ ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రోడ్డు పక్కనే నిల్చున్న ఓ ప్రయాణికుడు బస్సు కోసం లగేజితో ఎదురుచూస్తుంటాడు. సదరు ప్రయాణికుడిని చూసిన బస్సు డ్రైవర్…బస్సు ఆపగా కండక్టర్ దిగి లగేజ్‌ని బస్సులో పెట్టేందుకు ప్రయాణికుడికి సాయపడతాడు.
లగేజిని ప్రయాణికుడి నెత్తిమీద ఎత్తి తాను బస్సులో ఎక్కడ పెట్టాలో సదరు ప్రయాణికుడికి చూపిస్తుండగానే లగేజి నెత్తిమీద పెట్టుకున్న వ్యక్తి ఇంటిబాట పట్టడం అందరిచేత నవ్వులు తెప్పిస్తోంది. ఎందుకంటే ఆ ప్రయాణికుడు నిలబడింది బస్సు కోసం కాదు..లగేజీ ఎత్తే వ్యక్తి కోసం..ఇది అర్ధం చేసుకున్న కండక్టర్ సరదాగా ఆ వ్యక్తిని కొట్టడం కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.