- Advertisement -
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) మాదిరిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీజీపీఎస్సీ)ను తీర్చిదిద్దనున్నట్టు టీఎ్‌సపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం చె ప్పారు. ఈ క్రమంలో యూపీఎస్సీ చైౖర్‌పర్సన్ ప్రీతి సూదన్‌తో ఫోన్‌లో మాట్లాడి నియామక ప్రక్రియపై చర్చించారు.
18న ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీని సందర్శించాలని ఆయన నిర్ణయించారు. వెంకటేశంతో పాటు కమిషన్ సభ్యులు కూడా ఆ పర్యటనలో పాల్గొననున్నారు. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎ్‌సఎ్‌ససీ) చైర్మన్ ఎస్. గోపాలకృష్ణతో కూడా వెంకటేశం మాట్లాడారు. రిక్రూట్‌మెంట్ విధానాలపై మరింత విస్తృత చర్చల కోసం డిసెంబరు 19న ఆయనతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Also Read:ఈ వివాదానికి కారణం వినయ్: మనోజ్
- Advertisement -