సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బుర్రకథ. జూన్ 28న సినిమా విడుదల కానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది.
రామాయణంలో రాముడి శత్రువు రావణాసుడు,కృష్ణుని శత్రువు కంసుడు…అంటూ మొదలైన టీజర్‌లో నా శత్రువు నాతోనే ఉన్నాడు అంటూ ఆది చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. గురుకులాలు స్ధాపిస్తా,రోజు 24 గంటలు మనిషి మనిషిలా బతకాలి,స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా,వాడో రకంగా ఆలోచిస్తున్నడు…వీడు ఓ రకంగా ఆలోచిస్తున్నాడు..ఇద్దరు ఒకేలా ఎప్పుడు ఆలోచిస్తారో అంటూ సాగే టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అసలు ఎవరు వీరు అంటూ చివరలో 30 ఇయర్స్ పృథ్వీ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. మొత్తంగా లవ్,ఎమోషన్,సెంటిమెంట్,యాక్షన్ అన్ని కలగలిపిన బర్రకథ టీజర్‌పై మీరు ఓ ఓ లుక్కేయండి.
https://youtu.be/7B6Syq2wxlM