యుద్ధానికి రెడీగా ఉండు..ఆర్జీవీకి బన్నీ వార్నింగ్

222
- Advertisement -

పవన్-శ్రీరెడ్డి వివాదం సరికొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డితో పవన్‌ను తిట్టించింది తానేనని వర్మ సంచలన ప్రకటన చేసి సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వర్మకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నిర్మాత బన్నీ వాసు.

తామంతా బయటకు వస్తున్నామని… యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వర్మను హెచ్చరించాడు బన్నీ. తమ సత్తా ఏంటో నీకు రుచి చూపిస్తామని అన్నాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూల్ గా ఉండాలని తాము ఎప్పుడూ కోరుతుంటామని… కానీ ఇప్పుడు నీవు ఆడిన డ్రామా మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక ఫ్యాన్స్ ను ఆపే ప్రయత్నం చేయబోమని వాసు చెప్పాడు. మెగా ఫ్యామిలీ మద్దతుదారులంతా సమావేశం కాబోతున్నామని… తమ నిర్ణయం ఏమిటో ప్రకటిస్తామని తెలిపారు.

క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం నేపథ్యంలో నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించిన తరుణంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చిత్రపరిశ్రమకు అవమానకరమని ఆయన చెప్పారు. తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి లాంటి సినిమా తీసిన తెలుగు ఇండస్ట్రీని చిన్నబుచ్చవద్దని ఆయన కోరారు.

Bunny vas

- Advertisement -