టికెట్ రేట్ల వల్లే పైరసీ పెరుగుతోందా?

4
- Advertisement -

సినిమా టికెట్ ధరలు పెంచడం వల్లే పైరసీ సమస్య పెరుగుతోందని వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ విషయంలో ప్రేక్షకులు, పరిశ్రమలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్లే పైరసీ పెరుగుతోందని చెబుతున్నారు. నిజంగా ఎన్ని సినిమాలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి? ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి?” అని ఆయన ప్రశ్నించారు.

వంద సినిమాలు రిలీజ్ అయితే, అందులో కేవలం పాతిక సినిమాలకే టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి.కానీ ఆ పాతిక సినిమాలే కాదు, దాదాపు అన్ని సినిమాలూ పైరసీ అవుతున్నాయి అన్నారు.

దీనిని బట్టి చూస్తే, టికెట్ రేట్లు పెంచడం అనేది పైరసీ పెరగడానికి ప్రధాన కారణం కాదని ఆయన పరోక్షంగా సూచించారు. పైరసీ అనేది కేవలం ధరల సమస్య కాదని, దానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని బన్నీ వాసు అభిప్రాయపడ్డారు.

Also Read:OTT:ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలివే

- Advertisement -