బన్నీ ‘నా పేరు సూర్య’ ట్రైలర్….

295
Bunny Naa peru surya naa illu india Trailer Release
- Advertisement -

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం నా పేరు సూర్య. మే 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్‎గా నటిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో తీసిన సినిమా కావున పశ్చిమ గోదావరి జిల్లా.. తాడేపల్లి గూడెం సమీపంలోని మిలటరీ మాధవరంలో ఆడియో వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్‎లో భాగంగా కొద్ది సేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‎ని చిత్ర యూనిట్ విడుదల చేసింది

Bunny Naa peru surya naa illu india Trailer Releaseబిర్యాని బాగుందని ఖైదీ చెప్తుతుంటే ఇదే నీ ఆకరి బిర్యాని నిన్ను చంపేస్తున్నా అన్నా డైలాగ్‎తో ట్రైలర్ మొదలవుతుంది. నాకు కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయ్ మంత్రాలు రావు అని బన్నీ చెప్పే డైలాగ్‎లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సెంటిమెంట్, ఎమోషన్స్‎ని దర్శకుడు వంశీ చక్కగా చూపించాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బన్నీ అభిమానులకి ఈ ట్రైలర్‎తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు.

మరోవైపు ఈ నెల 29న గచ్చిబైలిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుంది. కే. నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. విశాల్‌–శేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా అనే పేరుతో కోలీవుడ్‌లో విడుద‌ల కానుంది. అను ఎమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా, శరత్
కుమార్, అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -