స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం నా పేరు సూర్య. మే 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో తీసిన సినిమా కావున పశ్చిమ గోదావరి జిల్లా.. తాడేపల్లి గూడెం సమీపంలోని మిలటరీ మాధవరంలో ఆడియో వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొద్ది సేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది
బిర్యాని బాగుందని ఖైదీ చెప్తుతుంటే ఇదే నీ ఆకరి బిర్యాని నిన్ను చంపేస్తున్నా అన్నా డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. నాకు కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయ్ మంత్రాలు రావు అని బన్నీ చెప్పే డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సెంటిమెంట్, ఎమోషన్స్‌ని దర్శకుడు వంశీ చక్కగా చూపించాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బన్నీ అభిమానులకి ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు.
మరోవైపు ఈ నెల 29న గచ్చిబైలిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుంది. కే. నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. విశాల్–శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎన్ పేరు సూర్య ఎన్ వీడు ఇండియా అనే పేరుతో కోలీవుడ్‌లో విడుదల కానుంది. అను ఎమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా, శరత్
కుమార్, అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.