స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడా లేదా అనే విషయం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ ట్విటర్ లో చరణ్ ను విశ్ చేయకపోవడంతో మెగా , అల్లు కుటుంబాల మధ్య ఏవో విబేధాలున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ మాటలకు ఫులి స్టాప్ పెట్టేశారు చిరు. బన్నీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ పెట్టాడు.
అల్లు అర్జున్‌కి అభినందనలు తెలుపుతూ చిరంజీవి తన ట్విట్టర్‌లో “డియర్ బన్నీ చాలా హృద్యంగా 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నావ్, ఆనందంగా ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఏడిగావ్. రాబోయే రోజుల్లో ఇంకా ఎదగాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరియు మరెన్నో హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను!💕🤗”. అంటూ విశ్ చేశారు మెగా స్టార్.
ఈ ట్వీట్ చాలా మందిని ఆశ్చర్యపరచలేదు, ఎందుకంటే చిరంజీవి తన మనస్సులో ఎవరి గురించి ఏమీ పెట్టుకోరని అందరికీ తెలుసు. చిరు బన్నీని పాన్-ఇండియా స్టార్ మరియు ఐకాన్-స్టార్ అని పిలవడంతో, అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
వీటిపై అల్లు అర్జున్ స్పందిస్తూ, “మీ ఆశీస్సులకు , మీ విషెస్ కి చాలా థాంక్స్. ఎప్పటికీ నా హృదయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాను ధన్యవాదాలు చికాబాబీ “.అంటూ రిప్లై ఇచ్చాడు.
మావయ్య, మేనల్లుడు ఒకరికొకరు తమ ప్రేమను ఇలా సోషల్ మీడియాలో చూపించుకొని తమ మధ్య ఎలాంటి గొడవలు లేదని , ఉండవని ఋజువ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…