బ్లాక్‌ ఫిల్మ్‌.. బన్నీ,కల్యాణ్‌ రామ్‌లకు షాకిచ్చిన పోలీసులు..!

104
- Advertisement -

టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌లకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాకిచ్చారు. కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న వీరి కార్లకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. శనివారం ఉదయం మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ మీదుగా రేంజ్‌ రోవర్‌ కారులో వెళ్తున్న బన్నీ కారును జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు నీరూస్‌ చౌరస్తాలో ఆపి తనిఖీ చేశారు.ఆయన కారు అద్దాలకు ఉన్న నల్ల ఫిల్మ్‌లను తొలగించి రూ.700 జరిమానా విధించారు. అదే దారిలో వచ్చిన మరో హీరో కల్యాణ్‌ రామ్‌ కారుకూ పోలీసులు ఇదే తరహాలో జరిమానా విధించారు.

వాహనాల నంబర్‌ ప్లేట్లపై వంకర టింకరగా అంకెలు రాయడం.. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించడం చట్ట విరుద్ధమని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు వారం రోజులుగా నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

- Advertisement -