‘బన్నీ క్లోజ్ ఫ్రెండ్’ తో రష్మిక

41
- Advertisement -

రష్మిక మందన్నా కి బాలీవుడ్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఆమె చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బాక్స్ తన్నేశాయి. కానీ రష్మిక మందన్నా చుట్టూ అల్లుకున్న రూమర్లు మాత్రం ఎక్కువే. విజయ్ దేవరకొండతో డేటింగ్ అని ఒకసారి, మరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో క్లోజ్ గా ఉంటోంది అని మరోసారి పుకార్లు షికారు చేశాయి. ఈ హాట్ రూమర్లకు తోడు ఇటీవల టాలీవుడ్ లో కూడా ఇలాంటివి జత అయ్యాయి.

Also read: సూర్య@42.. కంగువ టైటిల్ ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్నాకి కంఫర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా క్యారావ్యాన్ తెప్పించి ఆమెకి ఇచ్చారు అనే ప్రచారం తాజాగా ఊపందుకొంది. బన్నీతో రష్మిక మందన్నాకి మంచి అనుబంధం ఉంది అని, అందుకే ఆమెకు పుష్ప 2 సెట్స్ లో స్పెషల్ ట్రీట్మెంట్ అందుతుంది అని టాక్ నడుస్తోంది. అయితే, రష్మిక మందన్నాకి బన్నీతో కంటే కూడా.. బన్నీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓ బిజినెస్ మెన్ తో ఆమెకు మంచి రిలేషన్ కుదిరిందట.

Also read: Tollywood:మళ్లీ నోరు పారేసుకున్న తాప్సీ..!

సో.. బన్నీ కూడా తన స్నేహితుడి కోసం రష్మిక మందన్నాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అన్నమాట. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు రద్దు అయింది. దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. ప్రస్తుతం అధికారులు పలు విషయాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఉన్నట్టు ఉండి పుష్ప సినిమా షూటింగ్ ను రద్దు చేశారు.

- Advertisement -