స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రేపు రిలీజ్ కానుంది. విడుదలకు ముందే ఈ మూవీ రూ.85 కోట్లు రాబట్టి. బాక్సాఫీస్ వద్ద బన్నీ స్టామినా ఏంటో చూపించింది. దువ్వాడ జగన్నాథం రూ. 70 కోట్లు, సరైనోడు 75 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ తో బీజిగా ఉంది. వక్కంతం వంశీ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆపీసర్ గా కనువిందుచేయనున్నారు. దేశ భక్తి నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా ఫ్రి రిలీజ్ బిజినెస్ ను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకు నైజాంలో రూ.21 కోట్లకు అమ్ముడుపోగా సీడెడ్ లో రూ.12 కోట్లు. విశాఖలో రూ. 8 కోట్లు యూఎస్ లో రూ. 7 కోట్లు, మిగతా దేశాల్లో రూ. 2 కోట్లు, కేరళలో రూ. 3 కోట్లు, బెంగళూరులో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ. 5.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో
రూ. 4.2 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 5.4 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లు, కృష్ణాలో రూ. 5 కోట్ల వ్యాపారం జరిగిందని ట్విటర్లో వెల్లడించారు. మొత్తం ఈ సినిమాకి రూ. 85.87 కోట్ల బిజినెస్ జరిగిందని వంశీ తెలిపారు.
మరోవైపు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలకి అనుమతి లభించింది. ఇక రేపు ఉదయం 5 గంటల నుంచే బన్నీ థియేటర్స్ లలో సందడి చేయనున్నారు. వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బన్నీ ఈ సినిమాతో మరోసారి సత్తాచాటుకుంటాడని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్ పేరు సూర్య ఎన్ వీడు ఇండియా పేరుతో కోలీవుడులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అనుఇమ్మాయెల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు.