ప్రపంచకప్ 2019లో భాగంగా తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్..సఫారీలకు షాకిచ్చాడు బుమ్రా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఓవర్లలో ఆమ్లా,క్వింటన్ డికాక్‌లను పెవిలియన్‌కు పంపారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 26/2తో ఒత్తిడిలో పడింది.
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ నాలుగు సార్లు భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా.. మూడింట్లో సఫారీలు విజయం సాధించారు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా విజయం సాధించింది.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా తుది జట్టు: డికాక్ (వికెట్ కీపర్), హసీమ్ ఆమ్లా, డుప్లెసిస్ (కెప్టెన్), దుస్సేన్; డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, క్రిస్ మోరీస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్, షంషీ