కృతి శెట్టి లాంటి కొందరి భామలకు అదృష్టం బబుల్ గమ్ లా పట్టుకుంటుంది. ఒక్క సినిమాతోనే అనేక చిత్రాలు పొందిన బ్యూటీగా ఇప్పటికే కృతి శెట్టి గురించి బోలెడు కథనాలను చూశాం. ఇప్పటికే వరుస సినిమాల్లో ఛాన్స్ లు పొందిన ఈ సుందరికి ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందిట. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న సినిమాలో కృతి శెట్టి రెండో హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ లేదా జాన్వీ కపూర్ లలో ఒకర్ని ఫైనల్ చేయనున్నారు.
కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమా రెండో సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కావడంతో.. తారక్ ఈ సినిమా పై అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ కూడా కూర్చుంటున్నాడు. ప్రతి సీన్ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు.
ఇప్పటికే ఎన్టీఆర్ సలహాలు సూచనలతో కొరటాల పాత కథని చాలావరకు మార్చేశారు. ఇప్పుడు ఫ్రెష్ స్క్రిప్ట్ గా మారిందట. కేవలం కథలో కొరటాల చేసిన కొత్త మార్పులు కారణంగానే రెండో హీరోయిన్ కి చోటు దక్కింది. అలా కృతి శెట్టికి ఇంత పెద్ద అఫర్ వచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో ఆమె స్థాయి పెరగనుంది.
ఇవి కూడా చదవండి..