మీడియా,భీమా రంగాల్లో ఎఫ్‌డీఐలు…

413
budget high lights
- Advertisement -

2022 అన్ని గృహాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా చేస్తామన్నారు. అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. 1.9కోట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించామన్నారు. మీడియా, యానిమేషన్‌, విమానయాన,భీమా రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలిస్తున్నామని చెప్పారు.

ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోందన్నారు నిర్మలా సీతారామన్‌. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేస్తామన్నారు. ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం తీసుకువస్తామన్నారు.

స్టాక్‌మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు వెసులుబాటు. అవి విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు ఇస్తామన్నారు.ఈ ఏడాది మహత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరిస్తామన్నారు.

ఎఫ్‌డీఐల ఆకర్షణకు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం తీసుకోస్తామని చెప్పారు. రెడ్‌ టేపిజం నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ రహదారుల గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పవర్‌గ్రిడ్‌ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా చేస్తామని …విద్యుత్‌ టారిఫ్‌ పాలసీలో సంస్కరణలు అవసరమన్నారు. గ్యాస్‌ గ్రిడ్‌ హైవేల కోసం బ్లూ ప్రింట్‌…రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

- Advertisement -