2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర బడ్జెట్ పేపర్‌లెస్‌గా మారింది.
-దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ పేపర్‌లెస్‌గా మారింది.
-ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ట్యాబ్‌లో పొందుపరిచారు.
-ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మలా సీతారామన్ కనిపించారు.
-బడ్జెట్‌కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
-ఆరంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 407 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడ్డాయి.
-బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
-మేడిన్ ఇండియా ట్యాబ్‌లో నిర్మల బడ్జెట్
-ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
-మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టనున్నారు.