కొత్త విద్యా విధానం…ప్రతీ గ్రామానికి ఇంటర్‌నెట్‌

424
budget nirmala
- Advertisement -

ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్‌ తీసుకొస్తామని… వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగిస్తామన్నారు. నాలుగు కార్మిక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రపంచంలో టాప్‌-200 విద్యా సంస్థల్లో 30 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలకు మరిన్ని నిధులు. స్టడీ ఇన్‌ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

పరిశోధనలకు ప్రాధాన్యం కల్పిస్తామని… జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తామని… పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు చేపడతామన్నారు.

మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని తీసుకొస్తామన్నారు. అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్‌ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం అన్నారు. 81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథక కింద నిర్మించడం జరిగిందన్నారు.

డిజిటల్‌ అంతరాలను తొలగించే డిజిటల్‌ లిటరసీ కార్యక్రమం తీసుకొస్తున్నామని చెప్పారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నామన్నారు. 9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించామన్నారు.

- Advertisement -