ఏపీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి..

9
- Advertisement -

ఏపీ ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. గురువారం బుచ్చయ్య చౌదరితో గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య చౌదరి. తొమ్మిది సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత సీనియర్ ఎమ్మెల్యేలుగా బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, పెద్దిరెడ్డి లాంటివారు ఉన్నారు. అయితే అయ్యన్న పాత్రుడు కూడా  ఏడుసార్లు గెలవగా ఆయన్ని స్పీకర్ గా చేసే అవకాశం ఉండటంతో ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేశారు.  డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈనెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read:Harish:నాణ్యమైన విద్య ఎక్కడా?

- Advertisement -