- Advertisement -
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
బీఎస్ వీ గ్లోబల్ అనే సంస్థ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇవాళ ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.200 కోట్లతో సంస్థ ఆ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్‌కు వ్యాక్సిన్ హబ్ అనే పేరు సార్థకం అవుతుందని ఆయన చెప్పారు. సంస్థ ఎండీ సంజీవ్ స్నావన్ గుల్కు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -