బీఆర్ఎస్‌తో బీఎస్పీ..రెండు ఎంపీ సీట్లు

41
- Advertisement -

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఏనుగు పార్టీకి రెండు సీట్లు కేటాయించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ ఎంపీ స్థానాలను కేటాయిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీచేయనుండగా ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఈ నెల 5న బీఆర్‌ఎస్‌ అధినేతతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించారు. ఎంపీ సీట్లే టార్గెట్‌ బీఆర్ఎస్ అధినేత వ్యూహాన్ని రచించారు.

Also Read:ఆర్‌ఎస్పీ గెలుపుకోసం కృషి చేద్దాం:నిరంజన్‌

- Advertisement -