బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్..

253
- Advertisement -

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా 180 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త రూ.899 ప్యాక్ ను లాంచ్ చేసింది. రోజుకి 1.5 జీబీ ఉచిత డేటా లభించే ఈ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 270 జీబీ డేటా ఈ ప్యాక్‌లో లభించనుంది.

BSNL

బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికే రూ.999 రీచార్జ్ ప్యాక్ ఉన్నప్పటికీ దీని కాలపరిమితి కూడా 181 రోజులు మాత్రమే. ఇందులోనూ రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ దేశమంతటికీ అందుబాటులో ఉండగా, రూ.899 ప్యాక్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్యాక్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ (ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు తప్ప), రోజుకు 50 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

- Advertisement -