డాక్టర్ బజాజ్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

232
bajaj
- Advertisement -

బయోటెక్ ఇండస్ట్రీ ఆద్యుడు డాక్టర్ బీఎస్ బజామ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఆయన వయస్సు 93 ఏళ్లు..గతేడాది జరిగిన బయో ఏషియా సదస్సులో బజాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందజేసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం ..ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ఏషియ‌న్ బ‌యోటెక్ అసోసియేష‌న్స్ వ్య‌వ‌స్థాప‌క ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌జాజ్ చేసిన సేవ‌ల్ని సీఎం కేసీఆర్ కొనియాడారు. జీనోమ్ వ్యాలీ, బ‌యో ఏషియాను వాస్త‌విక రూపంలోకి తీసుకురావ‌డంలో డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ విశేష కృషి చేసిన‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బ‌యోటెక్ ప‌రిశ్ర‌మ‌ల‌కు బ‌జాజ్ చేసిన సేవ‌ల‌ను గుర్తు చేశారు సీఎం కేసీఆర్.

- Advertisement -