రాజ్ భవన్‌ను ముట్టడించిన BRSV

7
- Advertisement -

నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ రాజ్‌భవన్‌ను ముట్టడించారు బీఆర్ఎస్‌వీ నేతలు. నీట్ పరీక్ష ను రద్దు కోరుతూ బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. ఆందోళన చేస్తున్న బి.ఆర్.ఎస్.వి నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఎస్.ఆర్.నగర్ పి.ఎస్ కి బి.ఆర్.ఎస్.వి నాయకులను తరలించారు పోలీసులు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రులు గా ఉన్న కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదు..? అన్నారు.

గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు బీఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు తుంగ బాలు. వెంటనే నీట్ పరీక్ష ను రద్దు చేయాలని…దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ స్పందించక పోతే రాబోయే రోజులలో బి.ఆర్.ఎస్.వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం అని హెచ్చరించారు. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తం ఉందని భావిస్తున్నాం…ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం అన్నారు.

Also Read:Devara:’దేవర’కి భారీ డిమాండ్!

- Advertisement -