తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ సమావేశం

5
- Advertisement -

ఇవాళ ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్వీ సమావేశం జరగనుంది. 10 నెలల కాలంలో విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో విద్య వ్యవస్థ లో గణనీయమైన మార్పులు తెచ్చారు అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుందన్నారు.

ఉద్యమ కాలంలో కూడా విద్యార్థులు సమస్యలపై పోరాటం చేసి స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర బీఆర్ఎస్వీది.. భవిష్యత్తు కార్యాచరణపై మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు అన్నారు.

నాడు ఉద్యమంలో నేడు స్వరాష్ట్రంలో అయిన విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేది బీఆర్ఎస్వీనే అన్నారు తుంగ బాలు. నాడు ఉద్యమ సమయంలో స్థానికత,14 ఎఫ్ పై పోరాటం చేశాం…నేడు 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ఇవాళ నీట్ కోసం పోరాటం చేసిన చరిత్ర మా బీఆర్ఎస్వీ ది..రాష్ట్రంలో గురుకుల స్కూల్స్ లో అనేక సమస్యలు ఉన్నాయి.10 నెలలో చరిత్రలో విద్య వ్యవస్థ పూర్తిగా అద్వాన్నంగా మారాయి అన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా గురుకుల స్కూల్స్ తాళాలు వేశారు…రానున్న రోజుల్లో మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో ప్రభుత్వం పై పోరాటం చేస్తాం అన్నారు.10 గంటలకు బీఆర్ఎస్వీ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభం అవుతుందన్నారు. 10 ఏండ్ల పాలనలో విద్య వ్యవస్థ,10 నెలల పాలనలో విద్య వ్యవస్థను భేరీజు వేస్తూ సమావేశంలో చర్చిస్తాం అన్నారు.

Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్..జాగ్రత్త!

- Advertisement -