బీఆర్ఎస్వీ నేత గెల్లు అరెస్ట్

5
- Advertisement -

గ్రూప్ 1 అవకతవకలు విషయంలో విద్యార్థి సంఘాల నాయకులందరితో కలిసి చర్చించడానికి ఓయూకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గెల్లుతో పాటు బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించలేదు. గ్రూప్ వన్ అభ్యర్థులు అంటే మీకు ఇంత చులకనా? అని మండిపడ్డారు గెల్లు.

ఇలా కాలయాపన చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయం… గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌వీ పోరాటం ఆగదు అని తేల్చిచెప్పారు.

Also Read:ఏపీలో బార్ల లైసెన్స్ గడువు పెంపు

- Advertisement -