తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక..బీఆర్ఎస్ కైవసం

3
- Advertisement -

తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్‌గా బొంది రజిని రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా కొక్కొండ సమతా కాశిరెడ్డి ఎన్నికయ్యారు.

గజ్వేల్ మున్సిపల్ చైర్మన్‌గా గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్‌గా కళ్యాణ్కర్ పద్మాబాయి ఎన్నికకాగా ..దుబ్బాక మున్సిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ సంగీత, వైస్ చైర్మన్‌గా సులోచన ఎన్నికయ్యారు.

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏడుగురు కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్మన్‌గా కటకం రవీందర్, వైస్ ఛైర్మన్‌గా తురగ సౌజన్య శ్రీధర్ ఎన్నికయ్యారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకోగా మున్సిపల్ చైర్మన్‌గా ఆకాష్, వైస్ చైర్మన్‌గా ఎండి.హైమద్‌ను ఎన్నుకున్నారు కౌన్సిలర్లు.

Also Read:నాగబంధం..బైరాగిగా గరుడ రామ్‌

- Advertisement -