సంగారెడ్డి జిల్లా గడ్డిపొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకుంది బీఆర్ఎస్.మున్సిపాలిటీ వార్డులలో 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 3 కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఆలేరు మున్సిపాలిటీలోని 1వ, 4వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ముందంజలో బీఆర్ఎస్ ఉంది.మొత్తం 7 వార్డులకు గాను
4 వార్డుల్లో బీఆర్ఎస్
1 వార్డులో కాంగ్రెస్
1 వార్డులో బీజేపీ
1 వార్డులో ఇండిపెండెంట్ విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపు
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపు
Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్

