మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వచ్చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. 11వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 9 మున్సిపాల్టీల్లో 12 వార్డులు, రెండు కార్పొరేషన్లలో 2 డివిజన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మక్తల్ మున్సిపాల్టీలోని 6వ వార్డులో బీజేపి అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక వాయిదా పడింది.
మున్సిపాల్టీల్లోని 2, 582 వార్డులు, కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తంగా 73.01 శాతం పోలింగ్ నమోదయింది. మున్సిపాల్టీల్లో 75.88 శాతం, కార్పొరేషన్లలో 66.05 శాతం మంది ఓట్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీల్లో 28,04,274 ఓట్లు, ఏడు కార్పొరేషన్లలో 1,05,132 ఓట్లు ఇవాళ లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్

