CM KCR:మళ్లీ అధికారం మనదే

42
- Advertisement -

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు  అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్‌లు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు.

‘వజ్రతునక తెలంగాణ. స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం అన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంలో జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని సీఎం తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Also Read:KTR:తెలంగాణలో వార్నర్ బ్రదర్స్‌ పెట్టుబడులు

మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా పలువురు ముఖ్యనాయకులతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వచ్చిన ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికి ఎలా రోల్ మోడల్ అయిందో ఆయన తనదైన శైలిలో ఆవిష్కరించారు.

‘రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మనం కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నాం. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు అందరూ పనిచేస్తే కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ 50వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

పదేండ్ల కాలంలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే ఇవ్వాళ తెలంగాణ మోడల్ ను దేశం కోరుకుంటుంది అని సీఎం తెలిపారు. సూరాపేటలో, కామారెడ్డిలో లేదా మరో తెలంగాణ ప్రాంతంలో సభలు పెట్టుకుంటే వేలాది మంది మనప్రజలు రావడం సహజం కానీ, మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపిన మాడల్. దీన్నిమనం బాగా చెప్పుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు పలు సూచలు చేశారు.

Also Read:దశాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌గా సీఎస్‌ శాంతికుమారి

దశాబ్దితో శతాబ్ది వైభం తెలంగాణ సొంతం చేసుకున్నది. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సువర్ణావకాశంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. గోరటి వెంకన్న తన పాటతో మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ముఖానికి ప్రతిబింబం సీఎం కేసీఆర్ అని తమవైన శైలిలో ఆవిష్కరించారు. ‘ఉత్సవాలను అద్భుతంగా తెలంగాణ జీవకళ ఉట్టిపడేలా నిర్వహించాలి. ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూనుకోవాలి. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టుకోవాలి. ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించాలని దేశపతి శ్రీనివాస్ సూచించారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన విషయాన్ని చెప్పారు.

- Advertisement -