సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అన్నారు. 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్…గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ అన్న పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారని…దేశంలో విపక్షాలు ఐతే జేబులో లేదంటే జైల్లో అన్నట్లుగా ఉంది ప్రధాని మోడీ విధానం ఉందన్నారు.
మైనార్టీ సోదరులు ఒక్కసారి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలె అన్నారు. గతంలో ఒకరి పండుగలకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుని పరిస్థితి ఉండే..ఇప్పుడు దేశంలో మోడీ ఆ వాతావారణాన్ని చెడగొట్టి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. అలాంటి బీజేపీని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది మనమే అన్నారు. కాంగ్రెసోళ్లు వచ్చి బీజేపీ కి మనం బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారు…కానీ బండి సంజయ్, ఈటల, ధర్మపురి సంజయ్, రఘనందన్ రావు, బాపురావు ను ఓడించిందెవరో గుర్తు తెచ్చుకోవాలె అన్నారు.
బద్మాష్ రాజాసింగ్ కూడా ఓటమి నుంచి కాస్తలో తప్పించుకున్నాడు..కిషన్ రెడ్డి ని కూడా ఓడించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కిషన్ రెడ్డి కరోనా టైమ్ లో సికింద్రాబాద్ లో కుర్ కురే ప్యాకెట్లు పంచిండు…కేసీఆర్ కాళేశ్వరం లిప్ట్ లను ప్రారంభిస్తే…కిషన్ రెడ్డి గారు రైల్వే స్టేషన్ లో లిప్ట్ ను ఓపెన్ చేసిండని ఎద్దేవా చేశారు. సింటిక్స్ ట్యాంకర్, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఒక్క షెడ్ ను మాత్రమే కట్టించిండు..ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి, సికింద్రాబాద్ కు చేసివని ఈ మూడు పనులు మాత్రమేనన్నారు. మూసీ కి వరదలు వస్తే వెయ్యి కోట్లు అడిగితే రూపాయి కూడా సాయం చేయలే..బీజేపీ ని ఏం చేసినవ్ అని అడిగితే చెప్పేందుకు ఒక్కటి కూడా లేదు అన్నారు.పార్టీ మారిన దానం నాగేందర్ సీటు పోవటం ఖాయం. ఉప ఎన్నిక రావటం తథ్యం అన్నారు.
Also Read:KCR:22 నుంచి రోడ్డు షో లు..