వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే గెలుపు:జీవన్‌ రెడ్డి

4
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాను బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇవాళ తాను కేటీఆర్‌ని కలవబోతున్నాను…. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని జీవన్ రెడ్డి తెలిపారు.

అలాగే సీఎం రేవంత్ పాలనపై జీవన్ రెడ్డి ..తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ రెండున్నరేళ్ల పాలనలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందిఅని ఆరోపించారు.రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు మెరుగైనది అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని జీవన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్‌కు మళ్లీ అవకాశమిస్తారని అన్నారు.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి, ఈ పరిణామం రాబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక మలుపు తీసుకునే అవకాశముంది.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

- Advertisement -