Nama:బీఆర్ఎస్‌వే మెజార్టీ సీట్లు

21
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. కేసీఆర్ బస్సుయాత్రతో రాష్ట్రమంతటా సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారని, తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ, అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్‌ఎస్ విజయానికి సోపానాలని తెలిపిన నామా… రాష్ట్రంలో రాజయకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయని పేర్కొన్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీపై పోరాడుతామని తెలిపారు.

Also Read:కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన రాయ్ లక్ష్మీ!

- Advertisement -