KTR: కరీంనగర్ పార్లమెంట్ మనదే

21
- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ స్థానం మనదేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నారని.. దానిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. రూపాయి పని చేయని బండి సంజయ్‌కి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుందన్నారు.ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారన్నారు. కష్టకాలంలో తన వెంట నిలిచిన నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరూ కూడా అధైర్యపడొద్దని.. అందరికీ అండగా ఉంటానన్నారు.

Also Read:కాజల్ అగర్వాల్.. “సత్యభామ” రిలీజ్ డేట్

- Advertisement -