KCR:వచ్చేది బీఆర్ఎస్ సర్కారే

4
- Advertisement -

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు కేసీఆర్.

బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగ‌ల‌తో క‌లిసేటోళ్ల గురించి బాధ‌లేదని… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మ‌న‌కు గిదో లెక్క‌నా..? ఆలోచించాలన్నారు. కొన్ని సార్లు అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌ను న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోతారు… మొన్న‌టి ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. మ‌నం ఏ హోదాలో ఉన్న ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల్సిందే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదన్నారు. . తెలంగాణ ఆత్మ‌ను అర్థం చేసుకునే స‌త్తా.. బీఆర్ఎస్‌కు మాత్ర‌మే ఉందని తేల్చి చెప్పారు.

Also Read:ఎసిడిటీ సమస్యా..ఇలా చేయండి!

- Advertisement -