KCR:వచ్చేది బీఆర్ఎస్ సర్కారే..

7
- Advertisement -

మేము ప్రజాస్వామిక వాదులం. నేను ఒక మాట చెప్తున్నా.. ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన. నిజంగా కూడా బీఆర్‌ఎస్‌ ఒకసారి ఓడిపోతే మంచిదే అని చెప్పిన. అప్పుడు తేడా తెలుస్తది.. మళ్లీ వెంటనే నెక్ట్స్‌ టర్మ్‌లో బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తదన్నారు కేసీఆర్. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్.. మనం ఇరవై ఏండ్లు నిశ్చింతంగా, కదలకుండా ఉంటామని చెప్పిన. ఎందుకంటే, ప్రజలకు మన విలువ తెలుస్తది అని చెప్పి. గాడిద ఉంటే కదా గుర్రం విలువ తెలుస్తది అని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉందని…రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. 119లో మాకు 111 సీట్లు ఉంటేనే బీజేపోళ్లు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టిండ్రు… ఈ 64 మంది ఉన్న కాంగ్రెస్‌ను వీళ్లెక్కడ బతికనిస్తరు? ర్ణాటకలో మరో బాంబు పడేయడానికి రంగం సిద్ధమైంది. దాన్ని మింగేస్తరు. దాని తర్వాత తెలంగాణదే అని తెలిపారు.

ఈ గవర్నమెంట్‌ ఐదేండ్లు ఉండాలని కోరుకుంటాం. అప్పుడే పూర్తి రంగు బయట పడ్తది. వీళ్ల శక్తి సామర్థ్యం, తెలివితేటలు అన్నీ బయటపడుతయి. అప్పుడు ఆటోమెటిక్‌గా బీఆర్‌ఎస్‌ బ్రహ్మాండంగా గెలుస్తుందన్నారు.

Also Read:TTD:వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

- Advertisement -