KTR:జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

8
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ ప్రజల మద్దతుతో ఇవాళ,రేపు ఎప్పుడైనా బీఆర్ఎస్‌దే గెలుపు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు.

మేడిగడ్డ ప్రాజెక్టును రీపేర్ చేస్తా అన్నందుకే ఎల్‌ అండ్ టీ సంస్థపై సీఎం రేవంత్ పగ పెంచుకున్నారన్నారు. తాము దిగిపోయేప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద మెట్రో హైదరాబాద్ .. మన దగ్గర ఎయిర్ పోర్టుకు మెట్రో లేదని.. మైండ్ స్పేస్ నుండి శంషాబాద్‌కి మెట్రో వేయడానికి టెండర్ పూర్తి చేసి శంకుస్థాపన కూడా చేశామన్నారు కేటీఆర్.

ప్రపంచంలోనే మెట్రో రైలు రంగంలో అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ భాగస్వామ్యం L&Tది..L&T సంస్థ మెట్రో ప్రాజెక్టుతో నష్టాలు వస్తున్నాయని వెనక్కి తగ్గుతున్న సమయంలో కేసీఆర్ గారు చర్చలు జరిపి, హైదరాబాద్ లాంటి నగరానికి మెట్రో సౌకర్యం ఉండాలని దైర్యం చెప్పారు అన్నారు. కొవిడ్ సమయంలో మళ్ళీ ఇబ్బందులు వచ్చాయంటే, L&T సంస్థకు వడ్డీ లేని సాప్ట్ లోన్ ఇస్తామని మళ్ళీ దైర్యం చెప్పారు అన్నారు.

Also Read:KTR:ఎల్‌ అండ్‌ టీపై రేవంత్‌ అక్కసు?

- Advertisement -