రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాలని, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తానని అన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్.
ఎనిమిది వందల ఏళ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శమైన కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన కవాతు గుర్తుకు వచ్చేలా 1000 మంది కళాకారులతో, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన అడ్వకేట్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు అందరితో ర్యాలీ జరుపుతాం అన్నారు కర్నె ప్రభాకర్. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నుండి ర్యాలీ ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుందని…ర్యాలీలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించి, సచివాలయం ముందున్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటారన్నారు.
Also Read:నాన్ వయొలెన్స్..రిలీజ్ డేట్ ఫిక్స్