Vinod:బండికి ఓటమికి తథ్యం

26
- Advertisement -

కరీంనగర్‌లో ఈసారి బండి సంజయ్‌కు ఓటమి తప్పదన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. వేములవాడలో మార్నింగ్ వాకర్స్‌తో మాట్లాడిన వినోద్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. అధికారం శాశ్వతం అని ప్రధాని మోడీ అనుకుంటున్నారని…ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా అనుకున్నారని కానీ ప్రజలు బుద్దిచెప్పడంతో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని తేలిపోయిందన్నారు.

ఐదేళ్లు ఎంపీగా ఉండి బండి సంజయ్… ఐదు రూపాయలు కూడా తేలేదని అందుకే నియోజకవర్గ ప్రజలు ఈసారి సంజయ్‌కు ఓటు వేయొద్దని నిర్ణయించుకున్నారని చెప్పారు. గర్భిణులకు పాలు, గుడ్లు ఇస్తున్నామని బీజేపీ వాళ్లు పోస్టర్‌లు వేసుకున్నారని, ఆ పథకం జవహర్‌లాల్‌ నెహ్రూ అంగన్‌వాడీల ద్వారా అమలు చేసినప్పటి నుంచే ఉందని అన్నారు.

తాను పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచి తెలంగాణ సమస్యలపై 553 సార్లు ప్రశ్నలు అడిగానని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ సిరిసిల్ల వరకు తీసుకువచ్చానని, జాతీయ రహదారులు కూడా తీసుకువచ్చానని చెప్పారు. తన హయాంలో కరీంనగర్‌కు రూ.1000 కోట్ల నిధులు తెచ్చినట్లు తెలిపారు. తనను పార్లమెంటుకు పంపితే తెలంగాణ ప్రజల గొంతుకై వినిపిస్తానని ఆయన చెప్పారు.

Also Read:KTR:మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే భంగపాటే

- Advertisement -