యూజీసీ మూసాయిదాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై అనేక రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభిప్రాయాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్‌కు ఈ రోజే పంపామని మాజీ ఎంపీ తెలిపారు. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి.. వీసీలను మాత్రం కేంద్రం నియమిస్తుందా..? ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని మండిపడ్డారు.
ప్రొఫెసర్ల నియామకానికి ఉన్న నిబంధనలు మార్చే ప్రయత్నాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు వినోద్ కుమార్. తమకిష్టమైన వారిని బోధనానుభవం లేకున్నా కేంద్రం నియమించే అధికారం కొత్త నిబంధనలతో కలుగుతుంది. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. త్వరలో కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ను కలిసి యూజీసీ ముసాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరాలను తెలియజేస్తాం అన్నారు.
Also Read:దావోస్ టూర్..బోగస్ టూర్: క్రిశాంక్