ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గం తమ మొదటి సమావేశాన్ని జూమ్ కాల్ వేదిక నిర్వహించడం జరిగింది.ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జూమ్ కాల్ వేదిక ఆన్లైన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు , అలాగే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర వంటి అంశాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్ మరియు ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కూడా ఈ సమావేశం లో హాజరయ్యారు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఎన్నారైలతో ఇలా కలుసుకోవడం ఆనందంగా వుందనీ, కెసిఆర్ 2001 లో టీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ సమయంలో మరియు తెలంగాణ ఉద్యమానికి ఎల్లపుడూ వెనుదన్నుగా నిలబడ్డది ఎన్నారైలే అని గుర్తు చేశారు.అలాగే ముఖ్యంగా ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అంటే తనకు ప్రత్యేక అభిమానం అనీ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు వహించిన పాత్ర గొప్పదని తెలిపారు.ఉద్యమ సమయములో కూడా ఈ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా మాట్లాడుకునే వాళ్లమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, కెసిఆర్ గారి లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని, వారి నాయకత్వాన్ని కోల్పోయినందుకు ప్రజలు బాధపడ్తున్నట్టు వినోద్ తెలిపారు.కెసిఆర్ నాయత్వంలో అన్ని రంగాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించామని, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలు లెక్కలతో సహా మన అభివృద్ధిని అభినందిస్తూ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందని. కానీ ప్రస్తుతం తెలంగాణ దేశంలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేదని తెలిపారు.
మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమేనని అప్పటి వరకు ప్రజా సమస్యలను తీసుకొని ముందుకు వెళ్లాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైలంతా వివిధ అంశాలని
ప్రజలకు తెలిసేలా ప్రభుతాన్ని ప్రశ్నించాలని తెలిపారు.ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సభ్యులందరితో మాట్లాడుతూ …..ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తయినా, హామీలిచ్చిన ఏది కూడా అమలు చేయకపోవడం, రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్న సందర్భంగా రానున్న రోజుల్లో బాద్యత గల బీ.ఆర్.యస్ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్ మీడియా వేదికగా, అలాగే లండన్ లో ప్రత్యేక నిరసన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు.
అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చే ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్టు, రానున్నరోజుల్లో కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తామని క్షేత్రస్థాయిలో నాయకులని కార్యకర్తలనిసమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటామని, ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఉదృతంగాకాంగ్రెస్ పార్టీని నిలదీసి వీరి అరాచక పాలనను మోసాలను ఎండగట్టి ప్రజలకు దేశానికి తెలిసేలాచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల,సత్య మూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల & గణేష్ కుప్పాల, కార్యదర్శులు సతీష్ రెడ్డి బండ, సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, సోషల్ మీడియా కన్వీనర్స్ సాయిబాబా కోట్ల, అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్ మరియు ముఖ్య సభ్యులు పవన్ గౌడ్, నర్సింగ రావు ఉన్నారు.