BRS Vinod Kumar:కవితకు బెయిల్..బండివి అనాలోచిత వ్యాఖ్యలు

5
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్…తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు అన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు….రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది అన్నారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో వున్నారు కాబట్టే జైల్లో పెట్టారు అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదు,..లిక్కర్ పాలసీ నిర్ణయం పైన కేసులు పెట్టారు..సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారు,చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగిందన్నారు.

అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు సూచనలు తీసుకుని సమాధానం తీసుకుని సమాధానం చెబుతా అని ఆయన అన్నారు అంటే జైల్లో ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా …?మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి..ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు. ఆలస్యం అయినా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది..బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు..బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు,ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా ఐదేళ్ళు పని చేశారు అన్నారు.

Also Read:ఆలస్యమైన న్యాయమే గెలిచింది..బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

- Advertisement -