- Advertisement -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్‌పై స్పందించిన వినోద్ కుమార్..కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై..తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్న కేంద్రప్రభుత్వం..తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హామీలు అమలు చేయాలని,ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వెంటనే ప్రకటించాలన్నారు. మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు, నితీష్‌కుమార్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
Also Read:Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్
- Advertisement -